Site icon NTV Telugu

YS Jagan: మోడీ నాకు క్లాస్‌ పీకారట.. వాళ్లెవరైనా మోడీ సోఫా కింద ఉన్నారా..?

Ys Jagan

Ys Jagan

విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఓ దొంగల ముఠా.. ఈ దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అని పేర్కొన్న సీఎం జగన్.. గతంలో దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు.. ఢిల్లీకి వెళ్లా.. గంట సేపు ప్రధాని మోడీతో సమావేశం అయ్యా.. మంచి వాతావరణంలో సమావేశం జరిగింది.. అయితే చంద్రబాబు, దత్త పుత్రుడు (పవన్‌)… ప్రధాని మోడీ… జగన్‌కి క్లాస్ పీకారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వాళ్లెవరైనా మోడీ సోఫా కిందనో నా సోఫా కిందనో ఉన్నారా? అంటూ సెటైర్లు వేసిన సీఎం.. ఈ రకమైన మాటలు, ద్రుష్పచారం చూస్తుంటే నాకేమనిపిస్తుదంటే అసూయకు మందు లేదు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

Read Also: Governor Tamilisai: నేను ఎవ్వరినీ కించపరచటం లేదు.. నన్ను అవమానించారు..

ఇక, అసూయ పడితే బీపీ లొస్తాయి, గుండె పోటు లొస్తాయి. త్వరగా టికెట్ తీసుకుంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్‌ జగన్.. మరోవైపు, మారీచుడితో యుద్ధం చేస్తున్నాను అంటూ పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించని జగన్.. ఏ పార్టీతో కావాలంటే ఆపార్టీతో కలుస్తారు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోతారు.. చుట్టం వచ్చినట్లు రాష్ట్రానికి వస్తారు.. విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారని మండిపడ్డారు. తమకిష్టం లేని పార్టీ ప్రభుత్వం ఉంటే కలిసి పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తారని.. గజ దొంగలు ముఠా…‌ అధికారం తప్ప వేరే అజెండా లేదన్నారు.. వాళ్లు చెప్పే మాటలు వినొద్దు, ద్రుష్ప్రచారం నమ్మెద్దు.. మంచి జరిగితే జగన్‌ను నమ్మండి… కానీ, చంద్రబాబును, దత్త పుత్రుడు (పవన్‌ కల్యాణ్‌)ను మాత్రం నమొద్దు అని సూచించారు.

Exit mobile version