NTV Telugu Site icon

CM YS Jagan Open Challenge: చంద్రబాబు, పవన్‌కు జగన్‌ ఓపెన్‌ ఛాలెంజ్.. ఆ దమ్ముందా..?

Open Challenge

Open Challenge

CM YS Jagan Open Challenge: ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే కాకరేపుతున్నాయి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌కు బహిరంగ సవాల్‌ విసిరారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. 175 స్థానాల్లో పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా? అంటూ చాలెంజ్‌ విసిరారు.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన సీఎం జగన్‌.. వరుసగా నాల్గో ఏడాది రైతు భరోసా నిధులు విడుదల చేశారు. .పంట నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కూడా పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతులను వంచించిన చంద్రబాబుకు రైతుల కోసం పని చేస్తున్న మీ బిడ్డకి మధ్య యుద్దం జరుగుతుంది.. కరువు తో ఫ్రెండ్ షిప్ చేసే చంద్రబాబుకు, వరుణిడి ఆశీస్సులు ఉన్న మీ బిడ్డ జగన్ ప్రభుత్వానికి మధ్య వార్‌ నడుస్తోందని వ్యాఖ్యానించారు.. గతంలో ఖజానాలో డబ్బులన్నీ జన్మభూమి కమిటీలకు, కొన్ని మీడియా సంస్థలకు, దత్త పుత్రుడిని వెళ్లేవి.. మన ప్రభుత్వం లో నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తున్నాం అన్నారు..

Read Also: CM YS Jagan: కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు…

ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అనే చంద్రబాబుకు ఎస్సీలను మైనార్టీలను నా వాళ్ళు అనుకునే మీ బిడ్డ జగన్ కు యుద్ధం జరుగుతుంది.. రాబోయే ఎన్నికలలో ఏదైనా పొరపాటు జరిగింది అంటే మాట మీద నిలబడే వ్యక్తి రాజకీయాల్లో ఉండే పరిస్థితి ఉండబోదన్నారు.. మంచి చేశాం, మీకు మంచి జరిగితే నాకు తోడు ఉండండి.. మీ బిడ్డకు భయం లేదు.. మీ ఆశీస్సులు ఉన్నాయి.. చంద్రబాబుకు గానీ, దత్త పుత్రుడికి గానీ 175 ‘స్థానాలకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అని సవాల్‌ చేశారు.. 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అంటూ సభా వేదికగా చాలెంజ్‌ విసిరారు సీఎం వైఎస్‌ జగన్‌.. దీంతో.. సభలో ఒక్కసారిగా ప్రజలు చప్పట్లు, ఈలలు, గోలతో జగన్‌కు మద్దతు తెలిపారు.. సీఎం వైఎస్‌ జగన్‌ కసితో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు విసిరిన ఆ సవాల్‌ను వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..