CM YS Jagan: నా ఒక్కడి వలన జరిగేది కాదు.. మీరు నేను ఒక్కటైనప్పుడే సాధ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధించ కూడదు.. ఇది నా ఒక్కడి వలన జరిగేది కాదు.. నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది మీరు చేయాలి.. ఇద్దరం కలిసికట్టుగా చేయాలి అన్నారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.. నేను బటన్ సరిగ్గా నొక్కాలి. అక్కడ పొరపాట్లు జరగకూడదు. నా ధర్మం నేను చేయాలి. మీరు అంతా కలిసి ప్రతి గ్రామంలో మనం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకునిపోవడమే కాకుండా, వారికి అర్ధమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ల చల్లని ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఆశీస్సులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇద్దరం కలిస్తే సాధ్యం కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇది చేయడం కోసం మీ అందరి మద్దతు కూడా ఈ దిశగా కూడగట్టేందుకు ఈ రోజు మిమ్నల్ని ఇక్కడికి ఆహ్వానించామని తెలిపారు..
Read Also: Minister KTR : మా సహనాన్ని పరిక్షించవద్దు.. బీజేపీకి కేటీఆర్ వార్నింగ్
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఇక, సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడారు సీఎం జగన్.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన.. నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.. మిమ్నల్ని కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి… ఒకటి కలిసి చాలారోజులైంది.. కలిసినట్టు ఉంటుందన్నది ప్రధాన కారణమైతే… రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. 18 నెలలు అంటే చాలా దూరం ఉంది అనుకోవచ్చు.. దానికి సంబంధించి ఇప్పుడే ఈ కార్యక్రమం మొదలు పెట్టాలా ? అని అనుకోవచ్చు.. 18 నెలలు ఉన్నప్పటికీ ఆ దిశగా మనం అడుగులు ఎందుకు వేయాలన్నది చెప్పడానికే మిమ్నల్ని రమ్మన్నాం.. ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయి.. కానీ, మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయన్నారు.
మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్థ వచ్చింది.. ప్రతీ 2 వేల జనాభాకు 12 మంది అక్కడే కూర్చుని పనిచేసేటట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో అనుసంధానం చేసి, ప్రతి గడప, ప్రతి కుటుంబం కూడా అర్హత ఉండి రాని పరిస్థితులు ఉండకూడదని తాపత్రయపడుతున్నాం అన్నారు సీఎం.. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని ఎప్పుడూ జరగని విధంగా సాచ్యురేషన్ విధానంలో అడుగులు వేశాం. ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో లబ్దిదారుల చేతుల్లో పెట్టాం. వైయస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకుని క్రాప్ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాలు డీబీటీ ద్వారా ఆధార్ కార్డు సహా ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది ఆధారాలతో సహా పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరు మిస్ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం.. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు సీఎం వైఎస్ జగన్.
తొలిసారిగా గడప గడప అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోందన్ను వైఎస్ జగన్.. గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే.. మన ఎమ్మెల్యే కానీ, మన ఎమ్మెల్యే అభ్యర్ధి కానీ… గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్ధ, మండల స్ధాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, ప్రతి గడపలోనూ జరిగిన మంచిని వివరిస్తూ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ మరోవైపు పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే… అటువంటి వారు కూడా మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించాం. ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు ఆ సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. సచివాలయానికి రూ.20 లక్షలు అంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుంది. ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు ఉండాలి. ఒక్కోరోజు కనీసం 6 గంటలు ఆ సచివాలయంలో ఉండాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలని సూచించారు.
Read Also: Akula Srivani : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు
మీ నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతం. అంటే సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఏ పథకం చేరింది, ఎన్ని పథకాలు చేరాయి అని ఏకంగా ఆథార్ కార్డు డీటైల్స్‌తో సహా చెప్పగలికే పరిస్థితుల్లో సహాయం చేయగలిగాం అని వెల్లడించారు ఏపీ సీఎం.. గ్రామమే ఒక యూనిట్‌గా తీసుకుంటే ఆ గ్రామంలో 92 శాతం ఇళ్లకు.. ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప, గడపకూ కార్యక్రమం చేస్తున్నప్పుడు అవునన్నా పథకాలు అందాయి అని చల్లని ఆశీస్సులు ఆ అక్కచెల్లెమ్మలు మనమీద చూపించినప్పుడు ఆగ్రామంలో మనం గెలుస్తాం. గ్రామం గెల్చినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గం గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 కి 175 ఎందుకు రావు ? అని ప్రశ్నించారు.. ఒక్క మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాల్టీతో సహా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు లెక్క తీసుకుంటే.. మున్సిపాల్టీలో 30 కి 23 వైయస్సార్సీపీ, జడ్పీటీసీలు మూడింటికి మూడు, ఎంపీపీలు మూడింటికి మూడు ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయయన్నారు. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్‌స్వీప్ చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!