వ్యవసాయ మోటార్లకు కూడా మీటర్లు పెట్టడమేంటి? అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నా.. కేంద్రం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూనే ఉంది.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం.. దీనిపై వ్యతిరేక వ్యక్తమవుతూనే ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.. దీనిపై ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ.. కేంద్రం ఆదేశాల మేరకే…
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై రైతులకు లేఖలు రాయాలని సూచించారు సీఎం జగన్.. ఆ లేఖల్లో వ్యవసాయ మెటార్లకు మీటర్లు పెట్టడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు పేర్కొనాలని ఆదేశించారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. రైతులను దొంగలుగా భావిస్తున్నారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డ ఆయన.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఉద్యమిస్తామని హెచ్చరించారు.. మీటర్లు బిగిస్తే 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్న ప్రభుత్వం కామెంట్ల వెనుకున్న అర్థమేంటీ..? రైతులను దొంగలుగా ప్రభుత్వం భావిస్తోందా..? మీటర్లు పెట్టకపోతే వచ్చే నష్టమేంటీ..? అని నిలదీశారు. విద్యుత్ దోచేయడానికి…