CM YS Jagan Mohan Reddy: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. అక్కాచెల్లెలు చల్లగా ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటుందని.. మహిళల పక్షపాతిగా తాము ముందడుగు వేశామని అన్నారు. సున్నా వడ్డీని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామన్నారు. 4 సంవత్సరాల్లో 4,960 కోట్లు సున్నా వడ్డీ అందించామన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేసి, 1402 కోట్లు చెల్లించకుండా రోడ్డుపై నిలబెట్టిందని విమర్శించారు. 2016 నుండి సున్నా వడ్డీ పథకం రద్దు చేసి మోసం చేయడం నారా వారి చరిత్ర అని.. సున్నా వడ్డి నుండి డ్వాక్రా మహిళలల్ని విముక్తి కలిగించిన చరిత్ర నాది అని పేర్కొన్నారు. 25 లక్షల మంది కొత్తగా డ్వాక్రా గ్రూపుల్లో చేరి మహిళలు లబ్ధి పొందారన్నారు. చేయూత పథకం క్రింద మహిళలకు న్యాయం చేశామని.. మరే రాష్ట్రంలో మహిళలకు ఇంతలా ఆసరా కల్పించలేదని అన్నారు. గతంలో ఏ ఒక్క ప్రభుత్వం మహిళలకు పెద్ద మొత్తంలో చేయూత అందించలేదన్నారు.
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో తిలక్ వర్మ వద్దు.. ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆర్ధికంగా, సామాజిక పరంగా, వారి రక్షణ కోసం తాను కార్యక్రామలు చేస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్కలకు మంచి తమ్ముడుగా, చెల్లమ్మలకు అన్నగా నిలిచానన్నారు. తనకు అధికారం ఇస్తే ఎవరిని వదలను అని చంద్రబాబు అంటున్నాడని ఫైర్ అయ్యారు. దళితుల్ని చీల్చి వారికి నరకం చూపించాడని, దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు అన్నాడని, బీసీల తోకలు కత్తిరిస్తానని చెప్పారని గుర్తు చేశారు. మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని, ఎస్టీలకు ఒక ఎకరం పొట్ట కూడా చంద్రబాబు ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. ఆడవాళ్లను సైతం చంద్రబాబు అగౌరవపరిచాడని ఫైరయ్యారు. దోచుకోవడం కోసమే చంద్రబాబుకు అధికారం కావాలని ఆరోపించారు. అప్పట్లో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ అని.. అప్పటికంటే ఇప్పుడు అప్పుల గ్రోత్ రేట్ తక్కువ అని తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టాలని ప్రతిపక్షాలు మీటింగ్‌లు పెడుతున్నాయని.. ఇలాంటి రాక్షసులకు పోలీసులు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని అనుకుంటున్నానని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్లలో ఫ్యూజులు ఎగిరిపోయాయని తూర్పారపట్టారు.
K. A. Paul: పవన్, చిరంజీవి ప్యాకేజీ స్టార్లు.. మీరు వాళ్ల మాటలు నమ్మితే అంతే..!
చంద్రబాబు హయాంలో ఇన్ని డబ్బులు పడటం ఎప్పుడైనా చూశారా? చంద్రబాబు హయాంలో అసలు సామాజిక న్యాయం జరిగిందా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇన్ని పదవులు చంద్రబాబు హయాంలో వచ్చాయా? అని సీఎం జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు వ్యతిరేకించాడని ఆగ్రహించారు. ఇల్లు కట్టించే పని 75 సంవత్సరాల ముసలాయన ఎప్పుడైనా చేశాడా? చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకొస్తుందా? అని అడిగారు. ఇలాంటి వ్యక్తిని సీఎం కుర్చీలో ఎందుకు కూర్చోబెట్టాలన్నారు. ఇలాంటి చంద్రబాబును సీఎం చేయడానికి దత్తపుత్రుడు పరిగెడుతున్నాడని ఎద్దేవా చేశారు.