CRDA Authority meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.. సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో.. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పేదల కల నెరవేరబోతోంది.. ఇళ్లు లేని వారికి అమరావతిలో ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. దీనికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు పంపినీ చేయనున్నారు.. అమరావతిలో పేలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. అమరావతిలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్ల కోసం కేటాయించారు.. మొత్తం 20 లే అవుట్లలో ఈ స్థలాలు ఉన్నాయి..
Read Also: Election Heat in YSRCP: వైసీపీలో ఎన్నికల హీట్.. కసరత్తు షురూ..!
గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం.. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు పంపిణీ చేయనున్నారు.. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని స్పష్టం చేశారు.. నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద వీరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని.. మే నెల మొదటి వారం నాటికి పనులు ప్రారంభించాలని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, స్థానిక రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా.. సీఆర్డీఏ ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.