Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Ys Jagan Key Comments In Yclp Meeting

AP: వైసీఎల్పీ భేటీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Published Date :March 15, 2022 , 5:25 pm
By Sudhakar Ravula
AP: వైసీఎల్పీ భేటీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైసీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. మూడేళ్ల తర్వాత ఈ సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగింది.. సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్‌.. ఈ సమావేశానికి పిలవడానికి ప్రధాన కారణాలు, ఉద్దేశాలు ఉన్నాయన్న ఆయన.. ప్రభుత్వం ఏర్పాటై 34 నెలలు కావొస్తోంది.. మరో 2 నెలల్లో మూడు సంవత్సరాలు కూడా పూర్తి కావొస్తోంది.. ఇక పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.. నా అనుభవంతో నేను చెప్తున్నాను… ఇంటింటికీ, గడపగడపకూ వెళ్లడం కన్నా.. మరే ప్రభావవంతమైన కార్యక్రమం లేదన్న ఆయన.. కనీసం మూడు సార్లు డోర్‌–డోర్‌టు కార్యక్రమం చేయాలి.. కనీసం 2 సార్లు ప్రతి గడపకూ వెళ్లాల్సిన అవసరం ఉందని.. లేకపోతే ఎంతమంచి ఎమ్మెల్యే అయినా గెలవడం అన్నది ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు.

Read Also: High Court: ప్రభుత్వ ఉద్యోగులు సెల్‌ఫోన్లు వాడొద్దు.. హైకోర్టు ఆదేశాలు

ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు సీఎం వైఎస్‌ జగన్.. అందుకే ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామన్న ఆయన.. మన ఇళ్ల దగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్‌ పెట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.. ఉగాది నుంచి వాలంటీర్లకు సన్మానం చేస్తున్నాం.. వారి సేవలకు అవార్డులు ఇస్తున్నామని.. వారు బాగా చేసిన మంచి పనులకు చాలామంది వాలంటీర్లకు మనం పారితోషికం, మెడల్‌ ఇవ్వడం చేస్తున్నట్టు వెల్లడించారు.. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రాల కింద అవార్డులు ఇస్తున్నామని.. ఏప్రిల్‌ 2 నుంచి ఉగాది రోజున జరిగే ఈ కార్యక్రమం నెలరోజులు కొనసాగుతుందన్న ఆయన.. ప్రతి ఊరికీ వెళ్లి.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని.. గత ఏడాది కూడా వాలంటీర్లను సన్మానించాం.. ఈసారి ప్రతి రోజూ 3–4 గ్రామాలు వెళ్లి.. వాలంటీర్లను గౌరవించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.

మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలు ఎమ్మెల్యే తిరగాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. ఒక్కో గ్రామ సచివాలయానికి 2 రోజులు వెళ్లాలి.. ఆ సచివాలయంలో ప్రతి ఇంటికీ తిరగాలి.. ఆ ఇంట్లో జరిగిన మేలేంటి? ప్రతి కుటుంబానికి జరిగిన మేలుపై ముఖ్యమంత్రిగారి రాసిన లేఖను అందించాలని.. వారి ఆశీస్సులను పొందాలని తెలిపారు.. ఈ గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు క్యాడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలి.. క్యాడర్‌తో మీరు మమేకం కావాలి.. మళ్లీ బేసిక్స్‌లోకి వెళ్లి బూత్‌ కమిటీల ఏర్పాటు కూడా జరగాలని.. బూత్‌ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలని.. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగానలి స్పష్టం చేశారు.. వేరే సచివాలయానికి వెళ్లేముందు.. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని తెలిపిన ఆయన.. నియోజకవర్గంలో డోర్‌–టు డోర్‌ పూర్తికావడానికి కనీసం 8 నెలలు పడుతుందని.. 8 నెలలు అయ్యేసరికి ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే వెళ్తారని.. ఆ కుటుంబాల ఆశీర్వాదాలు తీసుకుంటారని వెల్లడించారు. మేలో సచివాలయాల సందర్శన ప్రారంభమయ్యే సరికి, జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు కావాలని స్పష్టం చేసిన ఏపీ సీఎం.. ఏప్రిల్‌ నాటికి కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలి.. ఈ కమిటీల ఏర్పాటులో రీజినల్‌ కో–ఆర్డినేటర్లు చురుగ్గా వ్యవహరిస్తారని.. 3–4 జిల్లాలకు రీజినల్‌ కో–ఆర్డినేటర్లు ఉంటారని.. కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని రీజినల్‌ కో–ఆర్డినేటర్లను నియమిస్తామన్నారు.. ఇక, జులై 8న ప్లీనరీ నిర్వహిస్తాం.. ఇలా ఒకవైపున పార్టీ నిర్మాణం సాగుతుందని వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • YCLP
  • YCLP Meeting
  • YSRCP

తాజావార్తలు

  • Amaravati Outer Ring Road Case: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

  • Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!

  • Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా

  • MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్

  • Papam Prathap: IPL కంటే మా సినిమానే బాగుంటుంది.. ‘పాపం ప్రతాప్’ హీరో తిరువీర్ కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions