వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కాకరేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడారు. గత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవిని కోల్పోయారు. ఇటీవల ఆయన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి కూడా రాజీనామా చేశారు. బాలినేని ఇప్పటివరకు నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్టీపై అలక కారణంగానే ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారంటూ కథనాలు వచ్చాయి.
Read Also: Gangula Kamalakar: రైతులు అధైర్యపడొద్దు, తడిచిన ధాన్యాన్ని కొంటాం.. మంత్రి గంగుల హామీ
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ బాలినేని గత కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా ఆయన స్పందించలేదని తెలిసింది. బాలినేని గత మూడ్రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే, సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయన పార్టీ వ్యతిరేకులతో తిరుగుతున్నారని, బాలినేనిపై ఫిర్యాదులు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు బాలినేని గురించి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది.
తాజాగా సీఎం జగన్- బాలినేని భేటీ పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయ్యారు బాలినేని. మీడియా కంటపడకుండా క్యాంపు కార్యాలయానికి రెండో వైపు నుంచి వెళ్ళారు. జగన్ తో భేటీ తర్వాత బాలినేని నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. స్థానికంగా తాను ఎదుర్కొంటున్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారని తెలుస్తోంది. నియోజకవర్గానికే పరిమితం అవుతానని చెప్పారు బాలినేని. బాలినేని ప్రస్తావించిన అంశాలన్నింటి పై సానుకూలంగా స్పందించారు సీఎం జగన్. అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని బాలినేనికి భరోసా ఇచ్చిన సీఎం..ముఖ్యమంత్రితో భేటీ అనంతరం నేరుగా హైదరాబాద్ కు బయలుదేరారు బాలినేని… జిల్లాలో ప్రోటోకాల్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు సీఎం జగన్. తనకు రీజనల్ కోఆర్డినేటర్ పదవి వద్దని సీఎంకు స్పష్టం చేశారు బాలినేని. సీఎం హామీతో బాలినేని అలక వీడతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Read Also: Human Brain: చనిపోయే ముందు మానవ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా..? అధ్యయనంలో సంచలన విషయాలు..