Target Kuppam: కుప్పంపై జగన్ ఫోకస్… క్యాడర్ తో కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటుపై సీఎం వైఎస్ జగన్ కన్నేశారా? కార్యకర్తలతో భేటీలో చర్చించిన అంశాలేంటి? మంత్రి పెద్దిరెడ్డి డైరెక్టన్ కుప్పం యాక్షన్ ప్లాన్ ఏంటి? అనేది హాట్ టాపిక్ అవుతోంది. కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో సీఎం వైయస్.జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నాం అన్నారు సీఎం జగన్.
కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని, ఎప్పటినుంచో చంద్రబాబుకి మద్దతుగానే ఉందని బయట ప్రపంచం అంతా అనుకుంటారు. వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం. బీసీలకు మంచి చేస్తున్నాం అంటే .. అది ప్రతి పనిలోనూ కనిపించాలి. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం.దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారు.అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చాం. చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో నేను ఆస్పత్రికి కూడా వెళ్లాను. ఆ రోజు భరత్ నాకు పరిచయం అయ్యాడన్నారు సీఎం జగన్. నేను భరత్‌ను ప్రోత్సహిస్తానని ఆ రోజే చెప్పా. ముందుండి ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశాం. మీరు కూడా భరత్‌పై అదే ఆప్యాయతను చూపించారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
దీనివల్ల భరత్ నిలదొక్కుకున్నాడు. భరత్‌ను ఇదే స్థానంలో నిలబెడతారా? లేదా ఇదే భరత్‌ను మళ్లీ పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీమీద ఆధారపడి ఉంది. భరత్‌ను గెలిపించుకు రండి. భరత్‌ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను. నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతాడు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు.నిజం చెప్పాలంటే.. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈమూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది.స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్లపట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీకూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు. మన కళ్ల ఎదుటే ఇవి కనిపిస్తున్నాయి. నాడు – నేడుతో బడులన్నీకూడా రూపురేఖలు మారుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా అమల్లోకి వస్తుంది. సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధికన్నా.. ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుతోంది.
రాబోయే రోజుల్లో మరింత జరుగుతుంది. వచ్చే రెండు రోజుల్లో కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నాం. భరత్ అడిగాడు, జగన్‌గా నేను చేయిస్తున్నాను. కుప్పం బ్రాంచ్ కెనాల్ పని జరుగుతూ ఉంది.సంవత్సరం లోపు దాన్ని పూర్తి చేస్తాం.కుప్పం నియోజకవర్గాన్ని నా నియోజకవర్గంగానే చూస్తాను. అన్నిరకాలుగా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. గతంలో కుప్పం గెలుస్తామా? అంటే ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడూ జరగని అద్భుతాలు జరిగాయి. పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేశాం. ఇవాళ ఇంత మంచిచేస్తున్న ప్రభుత్వానికి ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు.
గడపగడపకూ కార్యక్రమం ఇవాళ జరుగుతోంది. పథకాలన్నీ అందాయా? అని అడుగుతున్నాం. అందాయని ప్రజలు చెప్తున్నారు. రాజకీయాల్లో మనం ఉన్నందుకు సంతోషం కలుగుతుంది. రాజకీయనాయకుడిగా మనకు ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే.. ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు, వారు మనల్ని దీవిస్తున్నప్పుడు వస్తుంది. ఇవాళ కాలర్ ఎగరేసుకుని… మనం గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ ఆశీస్సులు ఇస్తున్న ప్రజల మద్దతు తీసుకునే బాధ్యత మీది. 175కి 175 సీట్లు గెలిచే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలన్నారు. మీ భుజస్కంధాలమీద ఈ బాధ్యతను పెడుతున్నా అని కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు జగన్. మీ మీద ఆ నమ్మకం నాకు ఉంది. రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి. కార్యకర్తలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తాం అన్నారు సీఎం జగన్.
తాజావార్తలు
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్‌బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్‌లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!