Site icon NTV Telugu

Cm Jagan Meets christian Community: క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో జగన్ భేటీ

Christian

Christian

క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు సీఎం. తమ సమస్యలను ముఖ్యమంత్రికి నివేదించారు బిషప్‌లు, రెవరెండ్‌లు ఇతర క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చర్చెస్‌ తరపున హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి… స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశాయి క్రైస్తవ సంఘాలు.

Read Also: Missing: డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది.. నెలరోజులు గడిచింది అయినా

చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చిన సీఎం. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి సీఎం హామీ.ఎస్పీ, కలెక్టర్‌లు జిల్లా స్ధాయిలో సమస్యల పరిష్కరిస్తారన్న సీఎం.క్రిస్టియన్‌ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామన్న సీఎం.దీని వల్ల సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందన్న సీఎం. క్రిస్టియన్లకు స్మశానవాటికలు ఏర్పాటు పైనా సానుకూలంగా స్పందించారు సీఎం జగన్మోహన్ రెడ్డి

Read Also: Twitter Layoff: డేటా ఎక్స్‌పర్ట్స్, ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన ట్విట్టర్

Exit mobile version