CM Jagan Tour: రేపు సీఎం జగన్ కుప్పం పర్యటన… బాబు వస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. చంద్రబాబు ఇలాకాలో జగన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుప్పంలో ఎలాగైనా పాగా వేయాలని, చంద్రబాబుని ఇంటికే పరిమితం చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. కుప్పం పర్యటనలో భాగంగా జగన్ వైయస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడినుంచి బయలుదేరతారు జగన్. వాస్తవానికి గురువారం కుప్పం పర్యటనకు జగన్ వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కి వాయిదా పడింది.
Read Also: Hyderabad Traffic: అలా చేస్తే కఠిన చర్యలే.. పోలీసులు స్పెషల్ డ్రైవ్..
Also Read
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15 – 12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని, వైయస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. బహిరంగ సభ తరువాత కుప్పం నేతలతో భేటీ అవుతారు. 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదిలా వుంటే సీఎం జగన్ పర్యటనకు విపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడైన చంద్రబాబునాయుడు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు భారీగానే ఏర్పాట్లు చేశారు.
కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు మంత్రి. చంద్రబాబు 33 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉండి కనీసం మున్సిపాలిటీ చేయలేకపోయారని.. అలాంటిది కుప్పంను మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్‌గా మార్చి జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.
కుప్పం నియోజకవర్గంలోని గోడలపై 175కు 175 సీట్లు.. ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ హడావిడి చేస్తున్నారు. చంద్రబాబుకి ఇప్పటికే ఆహ్వానం పంపారు అధికారులు. సాధారణంగా సీఎం పాల్గొనే కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం వుండదు. కుప్పం టూర్ లో జగన్ ఏం వరాలు ప్రకటిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Metro Train Dance : మెట్రో రైళ్లో డాన్స్ చేస్తూ యువతి రీల్స్.. తెగ వైరల్
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!