కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా థర్డ్‌వేవ్ పై సీఎం జగన్ ఆదేశాలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ థర్డ్‌వేవ్ కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు సీఎం జగన్. పీడియాట్రిక్ సింప్టమ్స్‌ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని.. ఈ మేరకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలని..పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించడానికి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సిఎం జగన్ సూచనలు చేశారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయాలని..పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించాలన్నారు. థర్డ్‌వేవ్ వస్తుందనే..అనుకుని కావాల్సిన మందులను ముందే తెచ్చి పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికప్పుడు మందులు కావాలంటే దొరకవు, ముందుగానే కావాల్సిన నాణ్యమైన మందులను తెచ్చుకోవాలని.. తగిన డాక్టర్లను గుర్తించాలన్నారు. వారిని రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని.. పిల్లలకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రులను ముందుగానే ఎంపానెల్ కోసం గుర్తించాలని పేర్కొన్నారు. ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రులకు కూడా థర్డ్‌వేవ్‌పై సమాచారం ఇచ్చి సన్నద్ధంచేయాలని.. ఆస్పత్రుల వారీగా ఏర్పాటు చేయదలచిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లపై కూడా దృష్టిపెట్టాలని వెల్లడించారు.
వీటికి సంబంధించి జరుగుతున్న పనులపై తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం జగన్ ఆదేశించారు.