Jagan – Modi: ప్రధాని మోడీతో భేటీలో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Discussed About These Issues With PM Modi: తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై చర్చించారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిలను విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పునవర్విభజన చట్టంలోని అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీల అమలుకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని.. హామీల అమల్లో కొంత పురోగతి సాధించినా, మరిన్ని కీలక అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలను, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఏపీ ఆ లోటును భరిస్తోందని వివరించారు.
Peddireddy Ramachandra Reddy: ఇతర రాష్ట్రాలకు ఏపీ ఒక మోడల్ స్టేట్‌గా నిలుస్తుంది
Also Read
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ప్రధాని మోడీకి సీఎం జగన్ ఇచ్చిన వినతిపత్రంలోని ప్రధాన అంశాలు ఇవే:
1. ఏపీకి ప్రత్యేక హోదా: విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, దాన్నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే ఏపీకి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని అన్నారు. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.
2. పోలవరం పెండింగ్ నిధుల విడుదల: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి రూ. 2,937.92 ఖర్చు చేసిందని, రెండేళ్లుగా చెల్లించని ఆ డబ్బుని వెంటనే చెల్లించాల్సి ఉందని అన్నారు. మొత్తం ప్రాజెక్టు కోసం రూ.55,548 కోట్లు అవుతుందని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిందన్నారు. పోలవరం నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్ వైజ్‌గా చూడొద్దని, బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పాటు వ్యయం కూడా పెరుగుతోందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం జరగాలంటే.. ముంపు ప్రాంతాల్లోని కుటుంబాల్ని తరలించాల్సి ఉంటుందని, అందుకు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని తెలియజేశారు. ఈ నిధుల్ని మంజూరు చేస్తే.. సకాలంలో పనులన్నీ పూర్తి చేయగలుగుతామన్నారు.
Noida Crime: యజమాని అరాచకం.. పనిమనిషిని లిఫ్ట్‌లో నుంచి లాక్కెళ్లి..
3. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయులు: 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయన్నారు. 2014–15 కు సంబంధించిన రూ.18,330.45 కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైనవి కలిపి మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా రుణాలు చేయడంతో, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రుణాలపై పరిమితి విధిస్తోందన్నారు. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన దానికి ఆంక్షలు విధిస్తోందని.. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు.
4. తెలంగాణ డిస్కంల బకాయిలు: తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాలని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ జెన్కోకు ఈ బకాయిలు ఎంతో ఊరట కలిగిస్తాయని చెప్పారు.
జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని.. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ప్రస్తుత ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని, ఇందుకు రూ.5,527 కోట్లు ఖర్చవుతుందన్నారు. కేంద్రం వద్ద ప్రతి నెలా సుమారు 3 లక్షల టన్నుల రేషన్ బియ్యం మిగిలిపోతున్నాయని, ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందన్నారు.
Pawan Kalyan: సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ.. ఆ పింఛన్లు ఎందుకు తొలగించారు?
జిల్లాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కు చేరిందని, ఇప్పటివరకూ ఏపీలో 14 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయన్నారు. మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలన్నారు. అలాగే కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని.. విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ఇప్పటికే సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించి, సహాయ సహకారాలు అందించాలని జగన్ కోరారు.
తాజావార్తలు
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
-
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!