CM Chandrababu: గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ కనూరి- జింఖానా తల్లి మరియు శిశు ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మంచి కార్యక్రమానికి సహకరించిన జింఖానా సభ్యులు, ఎన్నారైలకు ధన్యవాదాలు.. సమాజంలో మంచి మిగిలి ఉందనడానికి మీరు ఉదాహరణ.. జింఖానా సభ్యులందరిని అభినందిస్తున్నా.. మనం బాగుంటేనే చాలదు… చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి.. భారతదేశంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు ఏ దేశంలో లేవు.. పిల్లలు ఎంత పెద్ద వారైనా తల్లిదండ్రులకు జీవితాంతం తోడుగా ఉండేది మన దేశంలోనే.. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణంతోపాటు నిర్వహణకు ఫండ్ ఏర్పాటు చెయ్యడం గొప్ప విషయం.. నాట్కో ఫార్మా జీజీహెచ్ కు తనవంతు సేవ చేస్తుంది.. కేంద్రం కూడా పీపీపీ మోడల్ అవలంభిస్తుంది.. వేగంగా అభివృద్ధి చెందడానికి పీపీపీ మోడల్ లో పనులు చేస్తున్నారు.. పీ4 ద్వారా సమాజంలో పేదలకు సాయం చేసేలా ప్రోత్సహిస్తున్నాం.. చదువు గేమ్ ఛేంజర్.. అంబేద్కర్ చదువుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడా సాయం చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: Paul Stirling History: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. టీ20 చరిత్రలో పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర!
అయితే, ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం నిర్మూలించడానికి 22లక్షల కుటుంబాలకు సాయం అవసరం అని సీఎం చంద్రబాబు అన్నారు. పీ4లక్ష్యం కూడా పేదరిక నిర్మూలనే.. ఎంసీహెచ్ బ్లాక్ కు ప్రభుత్వపరంగా అండగా ఉంటాం.. డబ్బు సద్వినియోగం చేసినప్పుడే సంతృప్తి వస్తుంది.. మన సంపాదనలో కొంతభాగం సమాజానికి సేవ చేసేందుకు ఉపయోగిస్తే సంతృప్తి ఉంటుంది.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే.. 2038కల్లా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.. అమరావతి లాంటి ఫ్యూచర్ సిటీల అవసరం ఎంతో ఉంది.. నాలెడ్జ్, ఎకానమీకి తెలుగు రాష్ట్రాలు కేరాఫ్ గా ఉండాలి.. జాతికి గుర్తింపు ఉండాలంటే మంచి రాజధాని కావాలి.. క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమరావతి మారుతుంది.. పవర్ సెక్టార్ లో సంస్కరణలు తీసుకొచ్చి కరెంట్ కొరత లేకుండా చేశామన్నారు. 15 ఏళ్లలో అమరావతి రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
