CM Chandrababu: స్వచ్చాంధ్ర, స్వచ్ దివాన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోగా.. ఈ నెలలో సోర్స్ రీ సోర్స్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోవాలన్నారు. మన మూలాలు – మన బలాలు తెలుసుకునేలా.. రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. జీవన ప్రమాణాలు పెంచడం, పర్యాటకరంగానికి ప్రోత్సాహం, పెట్టుబడులు ఆకట్టుకోవడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, నెట్ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Read Also: Nagar Kurnool: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు మెమోలలో తప్పుగా వచ్చిన ఫోటోలు
ఇక, సంపూర్ణ స్వచ్ఛత వైపు అడుగులు వేయడం, పారిశుధ్యానికి ప్రాధాన్యత, ఘన వ్యర్ధాల నిర్వహణ, ప్రజారోగ్యం, ఇంకా కేంద్రం నిర్దేశించే లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వచ్చాంధ్ర అంటే స్వచ్చమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్లు, కాలనీలు, ఊళ్లు అని అందరు గుర్తించాలని తెలిపారు. ఇళ్లతో పాటు బహిరంగ ప్రదేశాలను, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. ఇది ఏ ఒక్క శాఖకో… ఒక్క అధికారికో సంబంధించిన కార్యక్రమంగా చూడవద్దని పేర్కొన్నారు. పరిశుభ్రత, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాల్లో పాఠశాల విద్యార్థి నుంచి నాయకుల వరకు బాధ్యత తీసుకోలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Read Also: PM Modi: అమెరికా టూర్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోడీ
కాగా, బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారన్నారు. వారి హత్యలపై విచారణ వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలి అన్నారు. ఇదే అంశం మ్యానిఫెస్టోలో కూడా పెట్టమని ఆయన తెలిపారు. దీంతో పాటు బీసీ విద్యార్థుల డైట్ బకాయిలు వెంటనే చెల్లించండి అని తెలిపారు. నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ స్కూళ్లను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం రూపొందించాలన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కోసం అవసరమయితే న్యాయ పోరాటం చేయ్యాలన్నారు. ప్రతి కార్పొరేషన్ కు దామాషా ప్రకారం నిధులను కేటాయించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.