Site icon NTV Telugu

CM Chandrababu: ఇవాళ పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Ap Cm

Ap Cm

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కీలక శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి తెచ్చే అంశంపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక, పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

Read Also: SL vs IND: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఓవర్లు.. రింకూ, సూర్య సంచనల బౌలింగ్ వీడియోస్ చూశారా?

అలాగే, కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. అక్టోబర్ నాటికి మద్యం కొత్త పాలసీ రూపొందించే అవకాశం ఉంది. పాత విధానంలో ఉన్న లోపాలను సరి చేయాలా..? లేక ప్రైవేట్ మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా..? అనే అంశంపై ఈ సమీక్ష సమావేశంలో అధికారులతో సీఎం చర్చ జరిపే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం, హోలో గ్రామ్ స్టిక్కర్ల స్కాంపై కూడా ఏపీ సర్కార్ చర్చించనుంది.

Exit mobile version