CM Chandrababu: ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పందించారు. హెఓడీలు, సెక్రెటరీలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం అద్భుతమైన ప్రాజెక్టు, ఇది పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రం మనతో పోటీ పడలేదని పేర్కొన్నారు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తుంది.. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం.. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాషం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది అని చంద్రబాబు తెలిపారు.
Read Also: Puja Khedkar: మరోసారి వార్తల్లో పూజా ఖేద్కర్.. ఈసారి దేనికోసమంటే..!
ఇక, ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు.. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అన్నారు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ నుంచి థ్రిల్లింగ్ అప్డేట్..!
అలాగే, అమరావతిని స్మశానం అని, ఎడారని ఎగతాళి చేశారు.. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం.. అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్.. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు బాగా స్పందించారు.. 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. అలాగే, భోగాపురం ఎయిర్ పోర్టు కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర సహకారంతో రూ.12 వేల కోట్ల సాయంతో దానిని కాపాడుకున్నాం.. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ ఆ ప్లాంట్ ను నిలబెట్టి తీరుతాం.. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.