టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాలో ‘స్వయంభు’ ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా,సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
Also Read : Kalyani Priyadarshan : రణ్‌వీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ పై.. కల్యాణి రియాక్ట్..!
పిరియాడికల్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంటర్వల్ సీక్వెన్స్ హైలైట్ కాబోతోందట. ఈ సీన్‌లో నిఖిల్ ఇతర ప్రధాన పాత్రల మధ్య వచ్చే యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా, రా (Raw) గా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో నిఖిల్ గెటప్, యుద్ధ సన్నివేశాల సెటప్ ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తాయని ఇన్సైడ్ టాక్. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సీన్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లనున్నాయట. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, ఈ లేటెస్ట్ యాక్షన్ అప్‌డేట్ నిఖిల్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.