NTV Telugu Site icon

CM Chandrababu: రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోకి హాజరు

Chandrababu

Chandrababu

CM Chandrababu: టెంపుల్ సీటి తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో జరగనుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శనను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రమోద్ సావంత్ లు పాల్గొననున్నారు. టెంపుల్ కనెక్టవిటి వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి మానస పుత్రిక అయిన ఐటీసీఎక్స్ 2025, అంత్యోదయ ప్రతిష్ఠాన్ సహకారంతో నిర్వహించబోయే కార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా దేవాలయ పర్యావరణ వ్యవస్థలను నెట్వర్క్ చేయడానికి, బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి ఒక డైనమిక్ వేదికను ఏర్పాటు చేస్తుంది.

Read Also: Naari Movie :‘నారి’ గొప్పతనాన్ని వివరిస్తూ.. కంటతడి పెట్టిస్తున్న పాట..

అలాగే, ఈ సదస్సులో 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్ షాప్లు, ప్రత్యేక మాస్టర్ క్లాస్లు, ప్రెజెంటేషన్లు, మాస్టర్లు ఆలయాలపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థలకు సంబంధించిన కీలక ప్రతినిధులు పాల్గొననున్నారు. మూడు రోజుల స్మారక కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1,581కి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశం అవుతారు‌. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ ఎక్సోపోలో 111 మంది స్పీకర్లు, 15 వర్క్ షాప్లుతో పాటు నాలెడ్జ్ సెషన్లు, 60 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆలయ నిర్వహణకు సంబంధించిన వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడంతో పాటు స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు, డిజిటలైజేషన్, ఆధారిత ఆర్ధిక వ్యవస్థను పెంపొందించడంపై చర్చించనున్నారు.