CM Chandrababu: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ ప్రజలకు అందిస్తున్నాం అని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారు.. ఈ బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళే బాధ్యత ఎమ్మెల్యేలదే అని ఆయన పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే మీ పని తీరులో మార్పు రావాలి అన్నారు. మళ్లీ మేము సభకు రావాలని అనే భావనతో ఎమ్మెల్యేల పని తీరు ఉండాలి అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Gorantla Madhav: చిక్కుల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..! ఎస్పీకి టీడీపీ, జనసేన ఫిర్యాదు
ఇక, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ రూపకల్పన చేశామని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమన్వయం ఉండాలి.. ఎక్కడ విభేదాలకు తావులేదు, గ్రూపు రాజకీయాలు సహించను అని వెల్లడించారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. పేదవారికి మన ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియజేయాలని సూచించారు.