Site icon NTV Telugu

CM Chandrababu: వేర్వేరు ఘటనల్లో ఏడుగురు పిల్లలు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరు వేరు ఘటనల్లో దాదాపు ఏడుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు పసిబిడ్డలు దూరమవ్వడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు అడుకుంటూ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Read Also: Durgesh : త్వరలో ఏపీలో నంది అవార్డులు.. మంత్రి దుర్గేశ్ ప్రకటన

అయితే, ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు గౌతమి, శాలిని, అశ్విన్ నీటి కుంటలో దిగి ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డల మృతితో తీవ్ర శోకంలో ఉన్న వారి తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు. అలాగే, విజయనగరం జిల్లా ద్వారంపూడి గ్రామంలో కారు డోర్లు లాక్ పడిన సంఘటనలో మరో నలుగురు చిన్నారులు చనిపోవడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Exit mobile version