NTV Telugu Site icon

Chandrababu: డి. శ్రీనివాస్ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

Chandrababu

Chandrababu

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని చెప్పుకొచ్చారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ఏపీ సీఎం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.

Read Also: Hyderabad: ఇంటి ముందు క్యాంప్ ఫైర్.. ప్రశ్నించిన వారిపై కాలుతున్న కట్టెలతో..

అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ గుండెపోటుతో ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ లో జన్మించిన డీఎస్ 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా పని చేశారు. ఇక, 2014 తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి బీర్ఎస్లో చేరిన డి. శ్రీనివాస్.. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్ను వీడి సొంతగూటి కాంగ్రెస్లో చేరారు. డి. శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కుమారులు.. నిజామాబాద్ మేయర్గా పని చేసిన డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్.. నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్న రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ ఉన్నారు. అయితే, హైదరాబాద్ నివాసంలో డీఎస్ పార్థీవదేహం ఉంచడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఇక, రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు కొనసాగనున్నాయి.