Free Bus In AP: శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. అయితే, దీనికి షరతులు వర్తిస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా తిరిగే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఈ ఫ్రీ బస్సు కేవలం జిల్లాకే పరిమితమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు.
Read Also: CM Chandrababu: కృష్ణా జలాలు లేకున్నా, గోదావరి నీటిని బనకచర్లకు తరలిస్తే కరువు ఉండదు..
ఇక, పోలవరం ఏపీకి పెద్దవరం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏటా 2 వేల టీఎంసీలు సముంద్రంలోకి వెళ్తున్నాయి.. ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీలు వాడుకోవచ్చు అన్నారు. రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమ.. ఇప్పుడు కాదు.. రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర బ్లూ ప్లింట్ ఉందన్నారు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.. మెట్ట పంటలు వేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తా.. సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పా.. అదే చేస్తున్నాను.. వేరే పార్టీకి, టీడీపీకి తేడా చూడాలి.. ఐదేళ్లలో పింఛన్ 200 నుంచి 2 వేలు చేసా.. పింఛన్ వెయ్యి పెంచడానికి గత ప్రభుత్వం ఐదేళ్లు తీసుకుంది.. కానీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ అందజేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
