Telugu Desam Party: కొవ్వూరులో తమ్ముళ్ళ కీచులాటలు.. టీడీపీకి ఇదేం ఖర్మ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Desam Party: టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 1న తూ.గో. జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. కొవ్వూరులో చంద్రబాబు పర్యటించడంతో పాటు బహిరంగ సభలోనూ పాల్గొంటారు. పార్టీ అధినేత వస్తున్న నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఈ కమిటీలో సుబ్బరాయచౌదరి, రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు సభ్యుల కమిటీ సభా వేదికపైకి వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రి జవహర్ పేరు చేర్చకపోవడం ఆయన వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. జవహర్‌ను కూడా వేదికపైకి పిలవాలని ఆయన వర్గం డిమాండ్ చేసింది.
Read Also: Asaduddin Owaisi: గుజరాత్ అల్లర్లు.. అమిత్ షా కామెంట్‌కి ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి జవహర్, ఇద్దరు సభ్యుల కమిటీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్‌కు వ్యతిరేకంగా మరో వర్గం నేతలు నినాదాలు చేశారు. గోబ్యాక్ అంటూ అరిచారు. అటు జవహర్ జిందాబాద్ అంటూ మరో వర్గం జేజేలు కొట్టారు. ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్నారు. దీంతో ఈ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఈ ఘటనతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి నచ్చజెప్పినా టీడీపీ శ్రేణులు శాంతించలేదు. కాగా ఇటీవల టీడీపీ ‘ఇదేం ఖర్మ’ అంటూ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీలో వర్గ విభేదాలు చోటుచేసుకోవడంపై స్థానికులు టీడీపీకి ఇదేం ఖర్మ అని కామెంట్ చేస్తున్నారు.
Read Also: Fake Revenue Papers.. Ex VRO Arrest: నకిలీ రెవిన్యూ పత్రాల తయారీ.. మాజీ వీఆర్వో అరెస్ట్
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!