టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కుటుంబం మధ్య మరోసారి రచ్చ రాజుకుంది. రాజమండ్రి సిటీ సీటు విషయంలో రెండు వర్గాల మధ్యవిభేదాలు ఎప్పటి నుంచో వివాదాలున్నాయి. 2014-19 మధ్య పీక్స్‌కు చేరిన గొడవలు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళతో పాటు గడిచిన ఏడాదిగా కాస్త తగ్గాయి. కిందిస్థాయిలోని నాయకుల మధ్య అడపాదడపా గొడవలు జరుగుతున్నా... అవి పెద్ద నేతలిద్దరూ జోక్యం చేసుకునేదాకా వెళ్ళలేదు.
Gorantla Buchaiah Chowdary: ఏపీలో వైసీపీ సర్కారు తెచ్చిన జీవోపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల సుబ్బయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నూతన సంవత్సర కానుకగా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ చీకటి జీవో తెచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. బ్రిటీష్ పాలకులు అమలుచేసిన 1861 పోలీస్ యాక్ట్‌ను ఆధారం చేసుకుని ప్రభుత్వం జీవో నెం.1 తీసుకొచ్చిందని వివరించారు. జగన్ రెడ్డి తీసుకొచ్చింది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక జీవో అని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన…
Telugu Desam Party: టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 1న తూ.గో. జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. కొవ్వూరులో చంద్రబాబు పర్యటించడంతో పాటు బహిరంగ సభలోనూ పాల్గొంటారు. పార్టీ అధినేత వస్తున్న నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఈ కమిటీలో సుబ్బరాయచౌదరి, రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు సభ్యుల కమిటీ సభా వేదికపైకి వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రి జవహర్ పేరు చేర్చకపోవడం…
కాకినాడలో ఎస్సై గోపాలకృష్ణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అధికారు వేధింపులు, అవమానాల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని కూడా మాట్లాడనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఎస్సై ముప్పవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య మొత్తం పోలీసు శాఖకే అవమానం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనం…
ఏపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో జగన్ పాకుడు మెట్ల మీద ఉన్నారని.. ప్రతిరోజూ ఆయన కొద్ది కొద్దిగా దిగజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. జై జగన్ కాదు.. గో బ్యాక్ జగన్ అని ప్రజలే నినాదాలిస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల ఆరోపించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు టూర్ మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగిందని.. ఏపీ ప్రభుత్వం ఛార్జీలతో విపరీతంగా బాదేస్తుందని ప్రజలే చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఓ చేత్తో డబ్బులు…