NTV Telugu Site icon

Telugu Desam Party: కొవ్వూరులో తమ్ముళ్ళ కీచులాటలు.. టీడీపీకి ఇదేం ఖర్మ?

Kovvur

Kovvur

Telugu Desam Party: టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 1న తూ.గో. జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. కొవ్వూరులో చంద్రబాబు పర్యటించడంతో పాటు బహిరంగ సభలోనూ పాల్గొంటారు. పార్టీ అధినేత వస్తున్న నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఈ కమిటీలో సుబ్బరాయచౌదరి, రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు సభ్యుల కమిటీ సభా వేదికపైకి వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రి జవహర్ పేరు చేర్చకపోవడం ఆయన వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. జవహర్‌ను‌ కూడా వేదికపైకి పిలవాలని ఆయన వర్గం డిమాండ్ చేసింది.

Read Also: Asaduddin Owaisi: గుజరాత్ అల్లర్లు.. అమిత్ షా కామెంట్‌కి ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి జవహర్, ఇద్దరు సభ్యుల కమిటీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్‌కు వ్యతిరేకంగా మరో వర్గం నేతలు నినాదాలు చేశారు. గోబ్యాక్ అంటూ అరిచారు. అటు జవహర్ జిందాబాద్ అంటూ మరో వర్గం జేజేలు కొట్టారు. ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్నారు. దీంతో ఈ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఈ ఘటనతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి నచ్చజెప్పినా టీడీపీ శ్రేణులు శాంతించలేదు. కాగా ఇటీవల టీడీపీ ‘ఇదేం ఖర్మ’ అంటూ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీలో వర్గ విభేదాలు చోటుచేసుకోవడంపై స్థానికులు టీడీపీకి ఇదేం ఖర్మ అని కామెంట్ చేస్తున్నారు.

Read Also: Fake Revenue Papers.. Ex VRO Arrest: నకిలీ రెవిన్యూ పత్రాల తయారీ.. మాజీ వీఆర్వో అరెస్ట్

Show comments