Sriharikota: షార్‌లో మరో విషాదం.. నిన్న భర్త.. నేడు భార్య ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sriharikota: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సీఐఎస్‌ఏఫ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే.. ఇప్పుడు సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగుతోంది.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కానిస్టేబుల్ చింతామణి మొన్న ఆత్మహత్య చేసుకున్నారు.. 29 ఏళ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.. నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవుపై సొంతూరుకు వెళ్లి ఈ నెల 10న తిరిగి వచ్చిన చింతామణి.. మొన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక, మొన్న సాయంత్రం షార్ మొదటి గేటువద్ద కంట్రోల్ రూమ్‌లో విధుల్లో ఉన్న బీహార్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్.. గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
అయితే, ఇవాళ తెల్లవారే సరికి మరో మరణవార్త వినాల్సి వచ్చింది.. ఆత్మహత్యకు పాల్పడిన సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్‌భార్య ఆత్మహత్య చేసుకుంది.. భర్త వికాస్ సింగ్ ఆత్మహత్యతో నిన్న బీహార్ నుంచి భర్తను చూడడానికి వచ్చిన ఆమె.. మనస్థాపానికి గురయ్యారు.. రాత్రి నర్మదా గెస్ట్‌హౌస్‌లో బస చేసిన ఆమె.. రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.. తెల్లవారే సరికి శవమై కనిపించింది.. నర్మద గెస్ట్ హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న తుపాకీతో కాల్చుకొని వికాస్‌సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మృతి విషయం తెలుసుకొని నిన్న తన అన్నతో కలిసి శ్రీహరికోటకు వచ్చారు. భర్త వికాస్‌సింగ్ మృతిని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వికాస్ సింగ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ఇప్పుడు ఆ చిన్నారులకు తల్లిదండ్రులు లేకుండా పోయారు.. కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్‌కేజీ, మరో కుమార్తె చిన్నపాప. ఇందులో ఓ కుమార్తె వికలాంగురాలిగా చెబుతున్నారు.. వికాస్ సింగ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతోన్న సమయంలో.. ఆయన భార్య కూడా ప్రాణాలు తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది..
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?