NTV Telugu Site icon

Mithun Reddy: ప్రభుత్వ తీరుపై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్.. లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి..

Mp

Mp

Mithun Reddy: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు.. ఇళ్లులు కూల్చుతున్నారు.. మా వారిని పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారు.. ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు.. పోలీసులు నన్ను వెళ్ళద్దు అంటున్నారు.. దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాను అని ఆయన వెల్లడించారు. 40 శాతం మంది వైసీపీకి ఓటు వేశారు.. వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా.. అధికారం శాశ్వతం కాదు.. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము.. మీరు వెళ్ళడానికి లేదు.. హౌస్ అరెస్టు చేస్తున్నాము.. అని నాకు నోటీస్ ఇచ్చారు.. పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు.

Read Also: Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రలో తొలిరోజు బాబా బర్ఫానీని దర్శించుకున్న 13 వేల మంది భక్తులు

ఇక, నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు అంటూ వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న ఇలాంటివి ఎప్పుడు చేయలేవు.. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు అని చల్లా బాబుకు సలహా ఇస్తున్నాను.. పోలీసులపై దాడి చేసి చల్లా బాబు జైలుకి వెళ్ళారు.. నేను అరెస్టు కైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి భద్ర పర్చుకోవడం కోసం రాం ప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారు అని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు.