Site icon NTV Telugu

Rk Roja: రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు.. మాజీమంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Roja

Roja

Rk Roja: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేసింది. తనపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఒక్క అభివృద్ధి పని చేయాలేదు.. గెలిచినప్పటి నుంచి నగరి ప్రజలకు ఆయన కనిపించలేదు‌ అని మండిపడింది. ఇక, ఇసుక అక్రమ రవాణాలో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను అరెస్టు చేయడం దారుణం అన్నారు. అక్రమ కేసులు పెట్టి మా నేతలను రిమాండ్ కు పంపుతున్నారు‌.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు‌‌‌ అని ఆరోపించింది. కేసులు ఎలా పెట్టాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

Read Also: Engineering Admission 2025: అలర్ట్.. ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల..

ఇక, రాజంపేట నుంచి తిరుపతి మీదుగా వచ్చి నగరి మీదుగా ఇసుక చెన్నైకి వెళ్తుందని మాజీమంత్రి రోజా ఆరోపించారు. టిప్పర్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు‌.. లెక్కల్లో తేడా వస్తే పోలీసులు అరెస్టు చేశారు.. సుప్రీంకోర్టు, హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై ఏం చెప్పిందో పోలీసులకు తెలియదా అని ప్రశ్నించింది. ఎమ్మెల్యే అనుచరులు ఈ ఇసుక దందా చేస్తే.. మా వైసీపీ కౌన్సిలర్లకు సంబంధం ఉందని పోలీసులు అబద్దాలు చెబుతున్నారు.. వైసీపీ నేతలు ఇసుక దందా చేసి డబ్బులు సంపాదిస్తుంటే చంద్రబాబు, లోకేష్ వదిలేస్తారా అని అడిగింది. మూడు జిల్లాలు దాటి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే, అధికారులు ఏం చేస్తున్నారని వైసీపీ నేత రోజా విమర్శించింది.


Exit mobile version