తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు పై ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. గత పది రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో ప్రమాదం జరిగింది.. ఇలా వెంట వెంటనే ఇలాంటి ప్రమాదాలు జరగడం తో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.. మొన్న ఎలక్ట్రిక్ బస్సు లోయలో పడిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. కానీ గాయ్యాలయ్యాయి. అలాగే టెంపో వాహనం ప్రమాదానికి గురైంది.. మరో ఘాట్ వద్ద కారు ప్రమాదం జరిగింది.. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా జరిగిన ప్రమాదం మరోసారి జనాలకు వణుకు పుట్టించింది..
ఈ రోజు ఉదయం ఓ టెంపో వాహనం ప్రమాదానికి గురైంది.. ఈ ప్రమాదం రెండో ఘాట్ రోడ్ లో జరిగింది.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు..టెంపో 6 అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. సైడ్ సేఫ్టీ వాల్ లేకపోవడంతో వాహనం నేరుగా కొండను ఢీకొట్టి ఆగిపోయింది.. ముందు వెళుతున్న బస్సును ఓవర్ టెక్ చెయ్యబోయి కొండను ఢీ కొట్టింది.. అయితే ఈ ప్రమాద సమయంలో టెంపో లో ఏ ఒక్కరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది..
ప్రమాద సమయంలో వేగంగా కొండను ఢీ కొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.ఇటీవల ఘాట్ రోడ్ ప్రమాదాలపై సమీక్ష నిర్వహించారు ఈవో ధర్మారెడ్డి. అతివేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణకోసం చర్యలు చేపట్టాలని సూచించారు. కొండపైకి వెళ్లే వాహనాలు, కిందకు వచ్చే వాహనాల అతి వేగ నియంత్రణకోసం చర్యలు చేపట్టారు.. నిదానంగా వెళ్ళాలని సూచించారు.. నెమ్మదిగా ఘాటును దిగడం, ఎక్కడం చెయ్యాలని సూచించారు.. ప్రమాధాలకు సరైన కారణాన్ని కనుక్కోవాలని అధికారులకు సూచించారు.. ఆ సమీక్ష జరిగిన వారంలోపే మరో ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది..వరుస ప్రమాదాలపై టీటీడీ సీరియస్ గా దృష్టిసారించింది.. ఈ ప్రమాదాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు