CM Chandrababu: సీఎం కీలక వ్యాఖ్యలు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం..

  • సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానమన్న సీఎం చంద్రబాబు..
  • రానున్న రోజుల్లో కుప్పంలో సహా జిల్లాలో అభివృద్ధి పనుల అమలుపై అధికారులకు దిశానిర్దేశం..
  • సాయంత్రం 6 గంటల తరువాత మంత్రులు సమావేశాలు పెట్టకూడదని చెప్పానన్న సీఎం.. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్దమీటింగ్ లు.. భారీ కాన్వాయ్ లతో సైరన్ల మోతతో హంగామాలు ఉండవు..
Cbn

Cbn

CM Chandrababu: చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం అని స్పష్టం చేశారు.. రానున్న రోజుల్లో కుప్పంలో సహా జిల్లాలో అభివృద్ధి పనుల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానమన్న ఆయన.. సాయంత్రం 6 గంటల తరువాత మంత్రులు సమావేశాలు పెట్టకండని చెప్పాను అన్నారు.. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్దమీటింగ్ లు, భారీ కాన్వాయ్ లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండబోవు అన్నారు..

Read Also: Speaker Gaddam Prasad Kumar: గత ప్రభుత్వం కాగితం మాత్రమే ఇచ్చింది.. డబ్బులు ఇవ్వలేదు..!

ఇక, అధికారులు ఫిజికల్.. వర్చ్యువల్ పని విధానాలకు సిద్ధపడాలని సూచించారు సీఎం చంద్రబాబు.. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.. మరోవైపు.. కుప్పంలో రౌడీయిజం, హిసం, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు అని స్పష్టం చేశారు.. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తేవేయండి అన్నారు.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుండే శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మరోవైపు.. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది.. పీఈఎస్ మెడికల్ కళాశాలలో పార్టీ శ్రేణుల సమావేశం అనంతరం.. రెండు రోజుల కుప్పం పర్యటన ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు సీఎం చంద్రబాబ నాయుడు.