YS Jagan Tour: రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించననున్నారు. ఈ సందర్భంగా కనీసం మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులకు ఆయన పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక, మీడియాతో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు 375 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే.. కొంతమంది జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు.. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్దమవుతున్నారు.. ఆటోల ద్వారా జనాలను తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారిపై సాక్ష్యాదారాలతో సహా కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ పేర్కొన్నారు.
అయితే, గతంలో సత్యసాయి, ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనల నేపథ్యంలో ప్రస్తుతం కఠినంగా వ్యవహరించక తప్పదని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. రైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందిని మాత్రమే అనుమతిస్తున్నాం.. మరో 30 మందిని హెలిప్యాడ్ వద్దకు పర్మిషన్ ఇచ్చాం.. ఈ పరిధి దాటితే ఖచ్చితంగా నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటాం అని పోలీసులు హెచ్చరించారు.