Site icon NTV Telugu

AP Crime: తల్లితో సహజీవనం.. ఏడాదిగా ఆమె కూతురిపై అత్యాచారం.. ట్విస్ట్‌ ఏంటంటే..?

Crime

Crime

AP Crime: తల్లితో సహజీవనం చేస్తూనే.. ఆమె కూతురిపై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. చిన్నారి అని కూడా చూడకుండా అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఏడాది కాలంగా ఆ చిన్నారిపై అత్యాచారం చేస్తూ.. నరకం చూపించాడు.. అంతే కాదు.. అభం శుభం తెలియని చిన్నారిపై తన ప్రియుడు అత్యాచారం చేయడానికి.. ఆ పాప తల్లి సహకరించడం కలకలం రేపుతోంది..

Read Also: KTR at Women’s Commission: మహిళా కమిషన్‌ ఆఫీసుకు కేటీఆర్.. కాంగ్రెస్ మహిళా నేతల నిరసన..!

చిత్తూరులో వెలుగు చూసిన ఈ దారుణానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తల్లితో సహజీవనం చేస్తూ , ఆమె కూతురిపై అత్యాచారం చేస్తూ వస్తున్నారు నవీన్‌ అనే కామాంధుడు.. అయితే.. తన కూతురును కంటికి పాపలా కాపాడాల్సిన ఆ తల్లి.. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేయడానికి ప్రియుడికి సహకరించడం కలకలం రేపుతోంది.. మైనర్ బాలికపై సంవత్సర కాలంగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడట కామాంధుడు . చిత్తూరు నగరం మున్సిపల్ క్వార్టర్స్ లో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్న షాకీరా భాను అనే మహిళ. ఆరో తరగతి చదివే కూతురుతో కలిసి నివసిస్తోంది.. ఇక, షకీరా భానుతో ప్రియుడు నవీన్ సహజీవనం చేస్తున్నాడు.. షకీరా భాను కూతుర్ని భయపెట్టి గత సంవత్సర కాలంగా అత్యాచారం చేశాడు నవీన్. అయితే, రెండు రోజులుగా షకీరా భాను కూతురు కనిపించక పోవడంతో అనుమానించిన స్థానికులు.. నవీన్, షాకీరా బానుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసుల విచారణతో నవీన్ ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.. ఆ త్వాత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Exit mobile version