Site icon NTV Telugu

Minister Ramprasad Reddy: కుప్పంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. అన్ని ప్రాంతాలకు సర్వీసులు

Ram Prasad

Ram Prasad

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీజిల్ రెట్లు తగ్గినా కూడా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ది అని ఆరోపించారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు.. శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఏ రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు ఉపయోగించమని అన్నారు. మరోవైపు.. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడుతామని తెలిపారు. 5 కొత్త బస్సులను ప్రారంభించామని.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయన్నారు. 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Read Also: Julian Assange: అస్సాంజేకి విముక్తి.. సుదీర్ఘ వివాదానికి ముగింపు..

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదల్లేదని.. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని తెలిపారు. ఆడంబరం చేయకుండా ప్రజల కోసం పని చేయాలని పేర్కొన్నారు. కార్మికులు, ప్రయాణికులు కళ్ళు లాంటి వారని అన్నారు. మరోవైపు.. డిపోలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ప్రభుత్వంతో ఏపీఏస్ ఆర్టీసీని 100 శాతం విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా.. కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read Also: IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే

Exit mobile version