Site icon NTV Telugu

Forest and Revenue Officials Joint Committee: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలు..! అటవీ, రెవెన్యూ శాఖల విచారణ ప్రారంభం..

Forest And Revenue Official

Forest And Revenue Official

Forest and Revenue Officials Joint Committee: చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఏర్పాటు చేసిన అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ విచారణ ప్రారంభించింది‌.. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్‍ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి ఆక్రమించారని భావిస్తున్న 295, 296 సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాలను పరిశీలించారు. పులిచెర్ల తహశీల్దార్‌ను చిత్తూరు కలెక్టరేట్‌కు పిలిపించి మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని దస్త్రాలను తెప్పించుకున్నారు కలెక్టర్ సుమిత్ కూమార్. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు నివేదిక సమర్పించనట్లు సమాచారం‌. .మంగళంపేట గ్రామపటం ప్రకారం చూస్తే ఆ రెండు సర్వే నంబర్లలోని భూమి దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్‌ మధ్యలో ఉంది. వాస్తవాలు నిగ్గు తేలాలంటే అటవీశాఖ అధికారులతో కలిసి లోతైన విచారణ జరపాలని పట్టాదారుల దగ్గరున్న పత్రాల్ని పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలోని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

Read Also: Ponnam Prabhakar: బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే.. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే!

Exit mobile version