Site icon NTV Telugu

CM Chandrababu: సీబీఎన్‌ 14 కాదు.. సీబీఎన్‌ 95 ఇక్కడ‌..‌ తప్పుచేస్తే తోక కట్ చేస్తా‌‌‌..!

Cbn

Cbn

CM Chandrababu: సీబీఎన్‌ 14 కాదు.. సీబీఎన్‌ 95 ఇక్కడ‌..‌ తప్పుచేస్తే తోక కట్ చేస్తా‌‌‌ అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉండే ల్యాండ్ రికార్డులు మొత్తం మార్చేశారు‌‌.. 22ఏ కిందా ప్రజల భూములను పెట్టి వైసీపీ నేతలు వేధించారు.. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారు‌ అని ఆరోపించారు.. అయితే, రాష్ట్రం మొత్తం సర్వే చేయిస్తున్నాం.. ప్రజలకు భూమికి రక్షణగా అన్ని చర్యలు తీసుకుంటాను అన్నారు.. కుప్పం హార్టికల్చర్ హాబ్ అవుతుందన్నారు.. గత ఐదేళ్లుగా నకిలీ మద్యం తాగి ఇష్టానుసారం ప్రవర్తించారు… రోడ్డుమీదకు వచ్చి మహిళలపై దాడులు చేశారు… నన్నే కుప్పానికి రానుకుండా చేశారు.. సీబీఎన్‌ 14 కాదు.. సీబీఎన్‌ 95 ఇక్కడ‌..‌ తప్పుచేస్తే తోక కట్ చేస్తా‌‌‌ అంటూ హెచ్చరించారు..

Read Also: Japan Airlines: 36వేల నుంచి 10వేల అడుగుల ఎత్తుకు పడిపోయిన విమానం.. చివరికీ…(వీడియో)

రాజకీయ నేరస్తుల మయం అయిపోయింది.. బాబాయ్‌ని చంపి.. బాబాయ్ కూతురుతో అన్న మంచోడని చెప్పించారు… నేను హత్య, శవ రాజకీయాలు చేయాను అన్నారు చంద్రబాబు.. ప్రజాహితం రాజకీయాలే నాకు తెలుసు‌.. ధర్మాని కాపాడుతాను.. అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తాను.. కానీ, అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుకోవాలని చూస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇక, వాట్స్ అప్ గవర్నెన్స్ తో సులువుగా సేవలు పొందవచ్చు… వెయ్యి కోట్లతో పలమనేరు… కృష్ణగిరి నాలుగు లైన్లు రోడ్డు అభివృద్ధి చేస్తాం.. కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు… అభివృద్ధి కావాలి… సంక్షేమం జరగాలన్నారు.. ఇంటింటికి చేసినా అభివృద్ధి చెప్పడానుకి సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం అభివృద్ధే నా లక్ష్యం అభివృద్ధి చేసి చూపిస్తా.. స్వర్ణ కుప్పం లక్ష్యంగా పెట్టుకున్నా.. చేసి తీరుతాం.. ఈ ఏడాదే కుప్పం నియోజకవర్గానికి నీళ్లు వస్తాయన్నారు.. కుప్పం ప్రజలు మట్టిలో నడవకుండా రోడ్లు వేస్తాం అన్నారు.. గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. మేం అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నాం.. కుప్పంకు ఎయిర్‌పోర్ట్‌ కూడా వస్తుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version