Chittoor Municipal Corporation: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఓ కార్పొరేటర్ తన పదవికి రాజీనామా చేశారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ నాయకురాలు హరిణి రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు హరిణి రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్‌కు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ, కనీసం ప్రమాణ స్వీకారం చేయకుండానే పదవిని వదులుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని హరిణి రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీకి, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తన వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆమె రాజీనామా నిర్ణయంతో చిత్తూరు కార్పొరేషన్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

