Site icon NTV Telugu

Chinta Mohan: సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర..! కేంద్ర మాజీ మంత్రి సంచలన ఆరోపణలు..

Chinta Mohan

Chinta Mohan

Chinta Mohan: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతా మోహన్‌.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది అన్నారు.. ఆయన మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.. ఒక స్వైన్ ఫ్లూ కేసు రోగి పక్కన సీతారాం ఏచూరి ఉంచారు.. దానివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు.. ఇక, ఏచూరికి మెరుగైన వైద్యం అందించకుండా కూడా బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు చింతా మోహన్‌..

Read Also: Bihar : మల విసర్జన చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళను ఢీకొట్టిన రైలు

మోవైపు.. వైఎస్‌ జగన్ మాటలు మానవత్వం గురించి మాట్లాడడం విడ్డూరం అన్నారు చింతా మోహన్‌.. సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొట్టించడం మానవత్వమా?.. ఇదేనా ప్రేమ..? అని ప్రశ్నించారు.. సెక్యులరిజం అంటే నిన్నటి వరకు బీజేపీతో కలిసి నాట్యం చేసి మాట్లాడడం ఏంటి? అని ఎద్దేవా చేశారు.. దళితులపై ప్రేమ కురిపిస్తూ మాట్లాడుతున్నారు.. కానీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు మూసేసావు.. స్కాలర్‌షిప్ లు ఎందుకు ఆపేశావు అని నిలదీశారు.. ఇక, వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్ ఇస్తే ఏమి..? ఎడమ చేతితో సంతకం చేయి.. ఎంతో మంది సంతకాలు పెట్టి పోయారని వ్యాఖ్యానించారు.. ఇప్పటికైనా తిరుమల లడ్డూ వ్యవహారంలో సైలెంట్ ఉండు అంటూ వైఎస్‌ జగన్‌కు సలహా ఇచ్చారు.. నీకు ఉన్న కొంచెం పరువు కూడా తీసేశారని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌. కాగా, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం ఏచూరి.. ఈ నెల 12వ తేదీన కన్నుమూసిన విషం విదితమే.. ఆయన వయసు 72 ఏళ్లు. కొద్దిరోజులుగా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడిన ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.. అయితే, చింతామోహన్‌ ఇప్పుడు ఆయన మృతిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Exit mobile version