NTV Telugu Site icon

Chinta Mohan: 2024 ఎన్నికల్లో ఊహించని పరిణామాలు.. ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో‌ బీఆర్ఎస్..

Chinta Mohan

Chinta Mohan

Chinta Mohan: ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో‌ బీఆర్ఎస్ ఎంట్రీకి కారణంగా అభివర్ణించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. చంద్రబాబు అక్కడ (తెలంగాణలో) సభ పెడితే.. కేసీఆర్‌ ఇక్కడ (ఆంధ్రప్రదేశ్‌లో) పెడుతున్నాడన్నారు. ఇక, ఎన్టీఆర్‌ లాగా కేసీఆర్ కు కూడా ప్రధాని కావాలనే ఆశ ఉందేమో..? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రానే రాదు అని జోస్యం చెప్పారు.. వైసీపీ పైకి ఎన్ని‌ గొప్పలు చెప్పినా.. పతనం ఖాయమన్న ఆయన.. 2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు ఉంటాయి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాపులంతా కాంగ్రెస్ పార్టీలోకి రండి.. మిమ్మలను సీఎంను చేస్తాం అని పిలుపునిచ్చారు.. నేను గుడిసె గుడిసె తిరిగాను.. జగన్‌ను తిడుతున్నారు.. టీడీపీ, వైసీపీ విధానాల వల్ల ప్రతి పేదవాడు అప్పుల పాలయ్యాడని.. ఫ్యాన్ మమ్మల్ని మోసం‌ చేసిందనే ఆక్రోశం ప్రజల్లో ఉందన్నారు.

Read Also: Granules: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. కుదిరిన ఒప్పందం

పేద ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది.. వైసీపీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు చింతామోహన్‌.. పెట్రోల్ ధర వంద కావాలంటే రూపాయి విలువ పతనం‌ కావాలని మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. ఇక, బీజేపీ పతనం ప్రారంభం అయ్యింది.. తిరిగి కోలుకోలేదని జోస్యం చెప్పారు. నేడు ఏపీలో కాంగ్రెస్ రాజకీయ పరిస్థితిని 18 ఏళ్ల క్రితమే ఊహించాను.. ఆనాడే మా అధిష్టానానికి వివరంగా లేఖ రాశాను అని గుర్తుచేసుకున్నారు. 2004లోనే మా‌ పార్టీ వాళ్లకు నేనే చదివి స్వయంగా వినిపించాను.. కాంగ్రెస్ పార్టీ పతనాన్ని నేను అప్పుడే ఊహించి చెప్పానన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న జనం చూస్తే.. దేశంలో పేదోళ్ల పరిస్థితి అర్థం అవుతుంది.. సంక్రాంతి కానుకగా రూ. 1500 విలువ చేసేవి ఇచ్చారు.. 3500 మందికి ఏర్పాటు చేస్తే.. వేల మంది తరలివచ్చారని.. టోకెన్లు ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగిందని వివరించారు. మరోవైపు, ఉచితంగా ఇస్తామంటే రాని పేదవాళ్లు ఉండరు.. వీటిని‌ సాకుగా చూపి వైఎస్‌ జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వడం కరెక్ట్ కాదని హితవుపలికారు చింతామోహన్‌.. స్వేచ్చ ఉన్న దేశంలో మీటింగ్ పెట్ట కూడదని ఆంక్షలు సరికాదన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. తిట్లు కూడా దీవెనలుగా తీసుకుంటే జగన్‌కే మంచిదని సూచించారు మాజీ ఎంపీ చింతామోహన్‌.