హత్యా రాజకీయాలు నేను ప్రోత్సహించను: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేత చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. చంద్రయ్య మృతదేహం గుండ్లపాడుకు తరలించారు. గుండ్లపాడుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు. గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. చంద్రయ్య గ్రామ సెంటర్లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. చంద్రయ్య హత్యను చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.చంద్రయ్య హత్య బాధాకరమన్నారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. హత్యా రాజకీయాలు నేను ప్రోత్సహించనన్నారు. రౌడీలపై తీవ్రవాదులపై పోరాడిన చరిత్ర టీడీపీది. చెంచాలతో మాట్లాడించడం కాదు జగన్ రెడ్డి దమ్ముంటే నువ్వు రా.. అంటూ సవాల్ విసిరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి నీ అడ్డుపెట్టుకుని జగన్ పల్నాడులో హత్యా రాజకీయాలకు చేస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు.
పల్నాడు నీ జాగీరు కాదు..మీరు పుడింగిలు కాదు.. మీరు పిరికి పందలు..పోలీసుల సహకారంతోనే మా కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. 22 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంది. నేను హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తే మీరు ఉండే వాల్లా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండకు పాల్పడుతోందని మండిపడ్డారు. పల్నాడులోనే ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. స్థానిక ఎన్నికల టైంలో బోండా ఉమా, బుద్ధాపై దాడి చేశారని అన్నారు. గత దాడుల సమయంలోనే చర్యలు తీసుకుంటే అడ్డుకట్ట పడేదని తెలిపారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టే విష సంస్కృతిని జగన్ చాటుకున్నారని విమర్శించారు. చంద్రయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
కార్యకర్త “పాడేమోసిన” చంద్రబాబు.

హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య ఇంటి వద్దకు చేరుకొని,అంతిమ యాత్రలో చంద్రబాబు స్వయంగా పాల్గొని పాడే మోశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!