Chandrababu: కశ్మీర్ టు కోనసీమ.. ఇది చాలా బాధాకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసిన విషయం విదితమే! వారం రోజులు అవుతున్నా, ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించలేదు. దీంతో ఉద్యోగులు ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోనన్న భయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. వారం రోజులైనా కోనసీమలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేకపోవడం.. రాష్ట్ర అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎక్కడో కశ్మీర్లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవల నిలిపివేత’ అనే వార్తను, ఇప్పుడు మన సీమలో వినాల్సి రావడం బాధాకరమని చెప్పారు.
ఐటీ వంటి ఉద్యోగాలను ఇవ్వలేని ఈ ప్రభుత్వం… కనీసం వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణమని చంద్రబాబు అన్నారు. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని పేర్కొన్నారు. చిరు వ్యాపారుల లావాదేవీలు సైతం ఇంటర్నెట్ ఆధారంగా నడుస్తున్నాయని, అలాంటి ఈ రోజుల్లో ఏకంగా వారం పాటు ఇంటర్నెట్ సేవల్ని పిలిపివేయడం సరికాదని అన్నారు. కోనసీమలో ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమని అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత ప్రజలకు ఇబ్బందిగా మారకూడదని చంద్రబాబు ట్విటర్ మాధ్యమంగా వెల్లడించారు.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం.(1/3) pic.twitter.com/oiZCesUOy2
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2022
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!