Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ.. విషయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మరో లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. పలు జిల్లాల్లో వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశువుల కూడా చనిపోయాయి అని లేఖలో పేర్కొన్న ఆయన.. జంగారెడ్డిగూడెంలోని తాడువాయి గ్రామానికి మెట్ల సంధ్య, కలిగిరి మండలం అనంతపురం గ్రామానికి చెందిన శ్రీవిద్య (38) భారీ వర్షాలకు, పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారన్నారు.. వర్షాల కారణంగా మిర్చి, మినుములు, జొన్నలు, అరటి, బొప్పాయి, మామిడి, టమాట, వరి తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.. పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, కర్నూలు, ఏలూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, కడప జిల్లాల్లో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్న ఆయన.. అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం ఉన్నా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉందని.. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవడం చాలా ముఖ్యం అన్నారు. వర్షాల కారణంగా మరణించిన బాధితుల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా అందజేయాలని కోరారు. ఇక, హార్టికల్చర్, వాణిజ్య పంటల నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలి. వర్షపు నీటిలో తడిసిన వరిధాన్యాన్ని కనీస మద్దతు ధర (MSP) చెల్లించి తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట రుణాల తక్షణ పునరుద్ధరణ చేపట్టాలి.. బాధిత రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి. వడగండ్ల వాన కారణంగా దెబ్బతిన్న ఆస్తికి పరిహారం చెల్లించాలని తన లేఖలో సీఎం వైఎస్ జగన్‌కు కోరారు చంద్రబాబు.
తాజావార్తలు
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!