ఆంధ్రా యూనివర్సిటీ పరిరక్షణ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవీ హర్షకుమార్… అందులో భాగంగా మార్చి 3వ తేదీన ఛలో ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించనున్నట్టు ఇవాళ మీడియాకు వెల్లడించారు.. యూనివర్సిటీ పరిరక్షణకు ఉద్యమిస్తున్నాం.. ఆంధ్రా యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తి కాపాడాల్సిన అవసరం ఉందన్న ఆయన.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేసిన వారికే యూనివర్సిటీలో పెద్దపీట వేస్తున్నారుని ఆరోపించారు..
Read Also: Hit And Run: కేంద్రం కీలక నిర్ణయం.. పరిహారం భారీగా పెంపు..
వైస్ ఛాన్సలర్ రెడ్డి కమ్యూనిటీ మీటింగ్‌కు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్న హర్షకుమార్.. రిటైర్ అయిన ఉద్యోగిని రిజిస్ట్రార్‌గా పెట్టిన చరిత్ర ఏ యూనివర్సిటీలో లేదన్నారు.. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తాం అన్నారు. ఇక, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో వేసిన అభివృద్ది కమిటీ చేసిందేమీలేదన్నారు హర్ష కుమార్… కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా ఉన్నాయని మండిపడ్డ ఆయన.. కేంద్రంలో బీజేపీపై పోరాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని స్పష్టం చేశారు.. కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాష్ట్రంలో మనుగడ అసాధ్యం అన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.