వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కారులో తీసుకెళ్లిన అనంతబాబు.. ఆ తర్వాత డెడ్‌బాడీతో తిరిగి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని.. అతడి కుటుంబసభ్యులకు తెలిపారు.. వారు ఆందోళనతో డెడ్‌బాడీతో పాటు కారు కూడా అక్కడే వదిలి వెళ్లిపోయిన విషయం విదితమే.. అయితే, ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశామని.. వెంటనే అరెస్ట్ చేస్తామని తెలిపారు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు..
ఈ రోజు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశాం, సీఎం జగన్ నిష్పక్షపాతంగా విచారణ చేయమని చెప్పారు.. ఇప్పుడున్న ఆధారాలతో అనంత బాబు ప్రధాన నిందితుడు.. అందుకే కేసు నమోదు చేశామన్నారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. ఇక, అనంత బాబును పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక టీమ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు.. ప్రధాన ముద్దాయిగా కుటుంబ సభ్యులు అనంత బాబు పేరును చెప్పడంతో.. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేస్తున్నాం.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు అవుతుందని.. తప్పు చేశాడు కాబట్టి అనంత బాబు ముద్దాయి అవుతాడని తెలిపారు.
సుబ్రహ్మణ్యం తల్లి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపిన ఎస్పీ.. 20న రాత్రి 7.30కి మణికంఠతో కలిసి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడు.. 12.30కి ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యం తల్లికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ చేశాడు.. 1.30కి వాళ్ల తమ్ముడు నవీన్ కి అనంత బాబు కాల్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారు.. ఆస్పత్రిలో డాక్టర్లు చనిపోయాడని చెప్పారు.. ఆస్పత్రి నుంచి ఇంటికి ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ తీసుకు వచ్చారు.. నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ అక్కడే ఉన్నారని తెలిపారు.. సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం.. ఆ తర్వాత హత్యానేరంగా మార్చామన్నారు.. ఎమ్మెల్సీ అనంతబాబుని ప్రధాన నిందితుడుగా నిర్ధారించామన్న ఆయన.. అనంతబాబుని అరెస్టు చేయబోతున్నాం అని వెల్లడించారు. 302 ప్రకారం హత్యానేరం కింద కేసు నమోదు చేశాం.. అతడి ఫ్రెండ్స్ చెప్పిన వర్షన్‌లో కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు..