ఏపీలో జగన్ పాలనపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రోజూ మామూలుగా మారిన అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలపై టీడీపీ మండిపడుతోంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ అథఃపాతాళానికి వెళ్ళిపోయిందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ విషయంలో మాట్లాడిన అంశాలపై ఆయన మాట్లాడారు.
ఏపీలో అధ్వాన్న పరిస్థితిపై మాట్లాడితే వైసీపీ దొంగల ముఠా విరుచుకుపడింది. పక్క రాష్ట్రాల సీఎంలు ఒక్కసారి ఏపీకి రండి. సొంత ఖర్చులు పెట్టి తీసుకొస్తాం. ఏపీని జగన్మోహన్ రెడ్డి ఎలా నాశనం చేసాడో చూపిస్తాం అన్నారు బుద్దా వెంకన్న. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు…ఓనమాలు తెలియని వాళ్లకి హోమ్ శాఖ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పై ప్రజల నుంచి తిరుగుబాటు మొదలయింది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ..వైసీపీ ఓడిపోతుందనే భయంతోనే పవన్ పై వైసీపీ అనవసర వ్యాఖ్యలు చేస్తోందన్నారు బుద్దా వెంకన్న.
Nara Lokesh: ఇంకెంతమంది ఆడబిడ్డలు బలవ్వాలి?