గుడివాడ ఏమన్నా పాకిస్తానా..?: బుద్ధా వెంకన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు టీడీపీ ఎమ్మెల్యే బుద్ధావెంకన్న వర్సెస్ మంత్రి కొడాలినానిగా మారాయి. ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా చిన్నపాటి మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానిపై ఫైర్ అయ్యారు. మంత్రి కొడాలి నానిది దొంగతనాలు చేసే బతుకు.. కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని బుద్ధా అన్నారు. కొడాలి నాని పాన్ పరాగ్ డబ్బా కొనుక్కునే డబ్బులు కూడా లేవు. అలాంటి కొడాలి నానికి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. పెద్ద కన్వెన్షన్ సెంటర్ కొడాలి నాని ఎలా కట్టగలిగారు..? మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేస్తే అఫిడవిట్ ఇవ్వలేదు. గుడివాడ ఏమన్నా పాకిస్తానా..? ఎవ్వరూ గుడివాడ వెళ్లకూడదా..? మొన్న టీడీపీ వాళ్లు వెళ్తే ఆపారు.. ఇప్పుడు బీజేపీని అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. పోలీసులు ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? కొడాలి నాని దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? ఓరేయ్ పిచ్చి కుక్క… చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలు చేస్తే గట్టిగా మాట్లాడితే మేమూ మాట్లాడతాం అంటూ బుద్ధా విరుచుకుపడ్డారు.
Read Also: నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు
Also Read
కొడాలినాని బాబు ఎవరూ..? మంత్రి కొడాలి చేసే కామెంట్లను వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా అసహ్యించుకుంటారు. 1991లో నెలకు రూ.1.15లక్షల అద్దె కట్టి నేను కొబ్బరికాయల వ్యాపారం చేశా. ఆ సమయంలో కొడాలినాని ఆగి ఉన్న వాహనాల్లో ఆయిల్ దొంగతనం చేసేవాడని బుద్ధా అన్నారు. చంద్రబాబుకి, కొడాలినానికి ఒకేసారి కరోనా వస్తే…, ఉండవల్లిలోని తన నివాసంలోనే హోం ఐసొలేషన్‌లో ఉండి కోలుకున్నారు. కరోనా సోకగానే చికిత్స కోసం పక్కరాష్ట్రంలో ఆస్పత్రికి పారిపోయిన కొడాలి నాని చంద్రబాబు ఆరోగ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాన్ మసాలాలు నమిలి నమిలి నోటి క్యాన్సర్ తెచ్చుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. మద పిచ్చి, డబ్బు పిచ్చి పదవి పిచ్చి పట్టిన కొడాలినాని జగన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. అలాంటి కొడాలినానికి అతడి భాషలోనే సమాధానం చెబుతామంటూ బుద్ధా వెంకన్న అన్నారు.
Read Also: సీఎస్ సమీర్ శర్మపై స్టీరింగ్ కమిటీ ఫైర్
కొడాలినాని మనిషి కాదు, ఓ పిచ్చి కుక్క.. కుక్కను నియంత్రించాలంటే మేం గర్జించాలంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్ని మోసగించాడనే కేసులున్న కొడాలి నానినే పెద్ద 420.. కొడాలినాని చంద్రబాబు పై విమర్శలు మానే వరకు నేను మానను అంటూ బుద్దా వెంకన్న అన్నారు. జగన్ సామాజిక వర్గం, వైసీపీ నేతలు కొడాలి నానిని ఎంతగా ద్వేషిస్తున్నారో జగన్ గ్రహించాలి. కొడాలి నాని పిచ్చి కుదర్చటానికే నేను ఇలా మాట్లాడుతున్నా… నన్ను పోలీసులు అరెస్టు చేసిన సమయంలోనే కొడాలినాని మళ్లీ మొరగటం ప్రారంభించారు.
Read Also: కేసీఆర్ తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేశారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
విజయవాడ 1టౌన్ లో మంత్రి కొడాలి నాని వాడిన భాషపై అభ్యంతరం తెలుపుతూ కేసు పెట్టినా ఇంతవరకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. నాపై కేసు పెట్టి విచారించినట్లే కొడాలినాని పై కేసు పెట్టి విచారించాలని బుద్దా అన్నారు. గుడివాడ వేరే పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకోవటానికి అదేమైనా పాకిస్థానా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొడాలినానిని వెంటనే అరెస్టు చేయాలి.. కొడాలి నాని మాట్లాడటం మానేస్తే మేము మాట్లాడం.. జెంటిల్మెన్ ఒప్పందానికి మేం రెడీ అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. చంద్రబాబు గురించి కొడాలి మాట్లాడితే.. నేనూ అదే స్థాయిలో మాట్లాడతా. కొడాలి నానిని పార్టీ నుంచి పంపిస్తే మీ పార్టీకున్న దరిద్రం పోతుందని వైసీపీకి చురకలు అంటించారు. మంత్రి కొడాలి నాని వెంటనే డిస్మిస్ చేయాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్‌గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్‌గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!