Site icon NTV Telugu

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బుద్ధా వెంకన్న విడుదల

డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్‌పై విడుదలయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2), రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Read Also: గుడ్ న్యూస్… నేడు మహిళల ఖాతాల్లో రూ.15వేలు జమ

పోలీస్ స్టేషన్‌లో బుద్ధావెంకన్నను సుమారు 7 గంటల పాటు పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలు మంగళవారం ఉదయం మీడియాకు చెప్తానన్నారు. పోలీసులు తనను అడిగిన విషయాల గురించి.. తనపై కొడాలి చేసిన వ్యాఖ్యల గురించి మొత్తం వివరిస్తానని తెలిపారు. ఈ విషయంలో అస్సలు తగ్గబోనని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని బుద్ధా వెంకన్న వివరించారు.

Exit mobile version