BRS in AP: ఏపీలో బీఆర్‌ఎస్ బిగ్ ప్లాన్..! గంటా, సీబీఐ మాజీ జేడీతో వివేక్ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS in AP: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేసి జాతీయ రాజకీయాల్లో అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు.. కలిసి వస్తున్న నేతలకు కండువాలు కప్పి.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.. ఇక, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు బీజం పడగా.. మరికొందరు నేతలను ఆహ్వానించేపనిలో పడిపోయారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలు కూడా పార్టీలో చేరతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నమాట.. దీంతో, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరు ఏపీ వెళ్లినా.. వారిని ప్రత్యేకంగా చూస్తున్నారు. తాజాగా, ఓ వార్త హల్ చల్ చేస్తోంది.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ సమావేశం అయ్యారు.. అంతే కాదు, గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ లోక్‌సభ స్థానం బరిలో నిలిచిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కూడా వివేక్ కలిశారు.. ఇప్పుడు.. పొలిటికల్ సర్కిల్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది.. విశాఖ వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. గంటా, వీవీ లక్ష్మీనారాయణతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారని.. త్వరలోనే వారు గులాబీ కండువా వేసుకుని కారు ఎక్కుతారనే ప్రచారం ఊపందుకుంది.
Read Also: Telangana Cabinet Meeting: ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్.. బడ్జెట్ ఆమోదం..
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
అయితే, గంటా శ్రీనివాసరావు గానీ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వర్షన్ గానీ వేరుగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ఓ వివాహ వేడుక కోసం వైజాగ్ వచ్చారు.. బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని పిలిస్తే వచ్చివెళ్లారని తెలిపారు గంటా శ్రీనివాసరావు.. అంతే కానీ, మా మధ్య ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో రాజకీయ చర్చలు మీడియా ప్రచారం మాత్రమేనని కొట్టిపారేసిన ఆయన.. తాను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కలిసి చాలా కాలం అయ్యిందన్నారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మరోవైపు.. ఎమ్మెల్యే వివేక్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్న కొట్టిపారేశారు వీవీ లక్ష్మీనారాయణ.. ఓ పెళ్లిలో వివేక్ కలిశాడు, టీ కోసం ఇంటికి ఆహ్వానిస్తే వచ్చి వెళ్లారంతే తప్పితే.. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, అనిల్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పెళ్లి నిన్న వైజాగ్‌లో జరగగా.. ఆ పెళ్లి కోసమే కుత్బుల్లాపూర్ ఎమ్మేల్యే వివేకానంద వెళ్లారని చెబుతున్నారు.. అయితే, ఏదేమైనా.. ఇప్పుడు.. పొలిటికల్ సర్కిల్‌లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇప్పటికే ఎన్నికల వ్యూహాల్లో అన్ని పార్టీలు మునిగిపోయాయి.. రాజకీయం మరి.. ఏ పార్టీ నేత.. ఏ కండువాతో కనబడతారో తెలియాలంటే.. మరికొంత కాలం ఆగాల్సిందే.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!