Site icon NTV Telugu

Botsa Satyanarayana: పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది..

Botsa

Botsa

Botsa Satyanarayana: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది.. ఎన్నికలు అంటే ప్రభుత్వానికి ఎందుకు భద్రతాభావం కలుగుతుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పుకునే చంద్రబాబుకే తన పాలనపై నమ్మకం లేదనే విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారు.. కానీ, మంత్రిని మాత్రం విచ్చలవిడిగా తిరగనిస్తారా? అని మండిపడ్డారు. ఇక, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు ఓట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దౌర్జన్యంతో గెలవాలని చూస్తే ప్రజలు చూస్తు ఊరుకోరు.. ఎన్నికల రోజును ‘బ్లాక్ డే’గా మేము భావిస్తున్నామని బొత్స చెప్పుకొచ్చారు.

Read Also: Kia Carens Clavis: ఇంత క్రేజ్ ఏంటయ్యా బాబు.. అమ్మకాలలో సంచనాలను సృష్టిస్తున్న కియా కేరెన్స్ క్లావిస్!

ఇక, పులివెందులలో ప్రజాస్వామ్యం వచ్చిందని కూటమి నేతలు చెబుతున్నారు.. ఏమి వచ్చింది.. ఒక జెడ్పీటీసీ ఉంటే ఎంత, పోతే ఎంత? అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కానీ, ఎన్నికల ప్రక్రియ జరిగిన తీరు మాత్రం అభ్యంతరకరమైనది.. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది? అందులో టీడీపీ వాళ్లు చొక్కాలు చింపుకోవడానికి.. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పుకొచ్చారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. మేము పోటీ పడతామన్నారు. కాగా, DIG స్థాయి అధికారి వచ్చి తలుపులు కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఎమ్మెల్సీ బొత్స ప్రశ్నించారు.

Read Also: Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోరం.. జవాన్‌లు సహా 33 మంది మృతి.. 220 మందికి పైగా గల్లంతు..!

అయితే, 2029 ఎన్నికల కోసం మంత్రి పార్థసారథినీ కాచుకుని కూర్చోమని చెబుతున్నాను అని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలు అయితే టాంపరింగ్, బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ చేస్తామని కూటమి నేతలు పరోక్షంగా సూచిస్తున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో 12 శాతం ఓటింగ్ తేడా వచ్చింది.. దానిని రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించలేదో వైఎస్ జగన్ ప్రశ్నించారు.. తెలంగాణలో ఉన్నది చంద్రబాబు శిష్యుడు కనుక హాట్‌లైన్‌లో ఉన్నారేమో అన్న భావన జగన్‌ది అని ఆయన అన్నారు.

Exit mobile version