NTV Telugu Site icon

Botsa Satyanarayana: డ్యాన్సులు చేసుకునే వ్యక్తి మనకు సీఎంగా అవసరమా.. బొత్స కౌంటర్

Botsa Counter To Pawan

Botsa Counter To Pawan

Botsa Satyanarayana Counter To Pawan Kalyan: రక్తపు మరకలు అంటిన సీఎం కావాలా? అంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డాన్సులు వేసుకునే వ్యక్తిగా సీఎంగా మనకు అవసరమా? అని నిలదీశారు. సచివలయాల్లో అవినీతిని నిరూపిస్తే.. తాను గుండు కొట్టించుకుంటానని ఛాలెంజ్ చేశారు. నారా లోకేష్ ఒక పొలిటికల్ లీడర్ అయితే, పవన్ కళ్యాణ్ ఓ సెలెబ్రిటీ అని.. వాళ్లేమీ మునులు కాదని ఎద్దేవా చేశారు. వాళ్ల యాత్ర వాళ్లవని పేర్కొన్నారు. వారాహి యాత్రపై హైప్ అవనసరమని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని దుయ్యబట్టారు. టక్కు టమార విద్యలు ప్రదర్శించి.. ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని తేల్చి చెప్పారు.

Adipurush: ఓం రౌత్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారో తెలుసా?

ఇదే సమయంలో కేంద్రం హోంమంత్రి అమిత్ షాపై కూడా మండిపడ్డారు మంత్రి బొత్స. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ అంటే అమిత్ షాకి, బీజేపీకి అర్ధం తెలుసా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు తప్ప.. ఒక్క రూపాయి కూడా అధికంగా ఇవ్వలేదన్నారు. పచ్చకామెర్ల వాళ్లకు పచ్చగా కనిపించినట్టు అమిత్ షా వ్యాఖ్యలున్నాయని ఎద్దేవా చేశారు. విమర్శలనేవి నిర్ణయాత్మకంగా ఉండాలి తప్ప.. పసలేని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని హితవు పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ప్రజలను అడిగితే అమిత్ షాకి తెలుస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు జరిగిన మేలు.. ఇతర రాష్ట్రాలలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కును అమ్మేస్తూ.. ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Tammanah: ఆ బోల్డ్ సీన్స్ ఏంటి.. ఆ బూతులు ఏంటి.. అసలు నువ్వు మా తమన్నావేనా..?

Show comments